ద్వందం
ఈ రోజు ఆస్ట్రాలజీ చార్ట్ రీడింగ్ ప్రాక్టీస్ సెషన్లో ని ఒక ఘటన మానవ స్వభావం గురించి ఒక ఆలోచనా తరంగమైంది
ఒకావిడ చార్ట్ రీడింగ్ కి ఒక వివాహిత చార్ట్ ఇచ్చింది ఒక senior స్టూడెంట్ ఆ జాతక చక్రాన్ని విశ్లేషించి ఆ అమ్మాయి స్వభావం మంచిది కాదు ఆమె ఈ ఇంటికి రావడం వల్ల అందరిని కష్టాల పాలు చేసేస్తోంది అని వివరించసాగాడు
వెంటనే ఆ చార్ట్ ఇచ్చిన ఆవిడ ఆ అమ్మాయి అన్ని దుర్గుణాల సోదాహరణ సందర్భాలలో వివరించడం మొదలు పెట్టింది అన్ని ఏకరువు పెట్టింది
అతను చెప్పినదానికి వత్తాసుగా ప్రూఫ్ గా సపోర్ట్ గా ఏదో తనకి తెలియని మరో కోణం ఆ అమ్మాయిలో చూసినట్లు
ఆ తరవాత టీచర్ వచ్చి పూర్తిగా విరుద్దంగా opposite గా ఆ అమ్మాయి గురించి చాలా మంచిగా చెప్పారు వెంటనే చార్ట్ తెచ్చిన ఆవిడ కాయిన్ టాస్ చేసినట్లు ఆ అమ్మాయిలో మంచి నైజాన్ని ఉదాహారణలతో సహా వివరించడం మొదలు పెట్టింది
ఔరా ! ఏమి చిత్రం అవే గ్రహాలు అవే స్థానాలు దృక్పథంలో మార్పేకాదు మంచి చెడు సోదాహరణతో సహా మారిపోయాయి కదా అని వాపోయాను
Associative learning అంటే ఇదే, దేన్ని దేనికి దేనితో ఆపాదించాలి అనే విషయంలో మనుషులు పొరపాటు చేయడం సహజం కదా అనిపించింది
గ్రహాలు చెప్పేది అందరికి అర్థమవవు అది దైవ భాష అందరూ ఆ భాష తమకి అవలీలగా అర్థమవుతుంది అనుకోవడం అమాయకత్వమే అనుకోవచ్చునేమో ! క్షంతవ్యురాలిని ఇలా అనుకుంటున్నందుకు 😔
No comments:
Post a Comment