Friday, May 3, 2024

Puraana Purushudu

ఉత్క్రుష్ట  జీవన శైలిలో

 మహోన్నత

 విలువలు చాటిందే రామాయణం. 

 శ్రీ రాముడి  అవతారానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది శ్రీ రాముని అందుకే కారణ

 జన్ముడు అంటారు 

రావణ సంహారం కోసం అవతరించిన శ్రీమన్నారాయణుడు . అందువలన

 శ్రీవారి జీవితంలో

 జరిగిన సంఘటనలు యాదృచ్చికంగా జరిగినవి కావు .   

ఇరు వర్గాల ప్రజలు కనిపిస్తారు మనకి ఈ భూలోకంలో . 

 ఆదర్శ పురుషుడి గా శ్రీ రాముడు ఒక వర్గం వాళ్ళు ధర్మాన్ని పాటించడం వల్ల

 దేవుడైనాడని

 తలంచేవాళ్ళు 

ఇంకో వర్గం వాళ్ళు దేవుడే ధర్మస్థాపనకు అవతరించినాడ ని నమ్మేవాళ్ళు 

మొదటి వర్గం వాళ్ళది మనిషిని దేవుడిగా మార్చే దృక్పథం 

రెండవ వర్గం వాళ్ళది దైవాన్ని శరణాగతి పొందే  విశ్వాసం  (trust  )

శ్రీ రాముని జాతకం యథాతథంగా మనకి రామాయణం లో దొరకదు . కారణం

 ఒకటి  కర్మ

 సిద్ధాంతం ఎక్కువ విలువైనదని  రెండు దైవానికి జాతకం చూడడం అవసరం

 లేదని అయ్యుండొచ్చును  . పునర్వసు

 నక్షత్రం జన్మ తారగా

 ఐదు గ్రహాలు ఉచ్చ లో ఉన్నట్లు గురువు చంద్రునితో ఉ న్నట్లు పేర్కొనబడింది. 

కావున ఉచ్చ గ్రహ స్థితి అంచనా వేసి పరిగణించారు . అందులో రాముడు ధర్మ

 పరాయణుడు

 కాబట్టి రవి మేషంలో ఉచ్చలో ఉన్నట్లు పరిగణించారు. 

Valmiki Ramayana Baalakanda 18 Sarga :

ततो यज्ञे समाप्ते तु ऋतूनां षट्समत्ययु:।

ततश्च द्वादशे मासे चैत्रे नावमिके तिथौ।।1.18.8।।

नक्षत्रेऽदितिदैवत्ये स्वोच्चसंस्थेषु पञ्चसु।

ग्रहेषु कर्कटे लग्ने वाक्पताविन्दुना सह।।1.18.9।।

प्रोद्यमाने जगन्नाथं सर्वलोकनमस्कृतम्।

कौसल्याऽजनयद्रामं सर्वलक्षणसंयुतम्।।1.18.10।।

विष्णोरर्धं महाभागं पुत्रमैक्ष्वाकुवर्धनम्।


శ్రీ రామునికి ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలియదని పొరపాటు చేసాడని

 అనుకోవటం

 మన సంకుచిత పరిజ్ఞానానికి నిదర్శనం.  గురువు మాట తు. చ తప్పకుండా

 పాటించాలనే మన

 సంస్కృతి శ్రీవారైన రాముని కర్మను నిలదీయగలదా ! శ్రీ రాముడు ఫలితం

 తెలిసీ రావణుని

 సంహరించడానికే మౌనం వహించాడని హైందవ నమ్మకం. శ్రీ రాముని కర్మ

 త్యాగానికి నిదర్శనం

 శ్రీ రాముని కనుసైగ ఆనతి లేనిదే లక్ష్మణుడు అడుగైనా వేయని వాడే మరి

 లక్ష్మణునిది స్వీయాచరణా  ? 

ఆజ్ఞ పాలనా ? సందేహం సహేతుకమైనదే . 

సీత రామ లక్ష్మణ భరత చరిత్రబాధ్యతాయుత జీవనానికి ఆనవాలం . 

మనకి కనిపించేవాటికంటే కనిపించని వినిపించని మర్మాలెన్నో మన చేతనా

 స్థాయిని బట్టి విప్పారిన

 దళాలై మన మేధ యందు వికసిస్తుంటాయి
 
మాయ పొరలు కమ్మిన సంకుచిత మానవ మేధస్సు మూసలో పోసి శ్రీరాముని

 ఆసాంతం

 తెలుసుకున్నామనుకోవడం మన నిర్హేతుక భ్రాంతి . 

No comments:

Post a Comment

                                                            ద్వందం   ఈ రోజు ఆస్ట్రాలజీ చార్ట్ రీడింగ్  ప్రాక్టీస్  సెషన్లో ని  ఒక ఘటన మానవ స...